Chatbot Icon

మహా శివరాత్రి పర్వ దినం తో కుంభమేళా ముగింపు

హిందువులను ఐక్యం చేసిన మహా కుబ్

Published by Rightwing Network on Feb 26th, 2025

మహా శివరాత్రి పర్వ దినం తో కుంభమేళా ముగింపు

ప్రయాగ రాజ్‌ లోని త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు బుధవారం చివరి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీ నిర్వహణ, భద్రత చర్యలు పటిష్టంగా చేపట్టారు అక్కడి యూపీ ప్రభుత్వం. తొలి రోజులలో జరిగిన తొక్కిసలాట సంఘటన తర్వాత, అధికారులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
స్నాన ఘాట్‌లలో , మేళా మైదానాలలో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కుంభ స్నాన ఘాట్ వద్ద ఒక స్త్రీ తన భర్తతో వీడియో కాల్ లో వుండి, తన భర్త కొరకు, డిజిటల్ స్నానం చేయించడానికి తన ఫోన్ ని గంగా నదిలో ముంచిన ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ గా మారింది. రైల్ల మద్య సమన్వయం, పారిశుద్ధ్య నిర్వాహన వైద్య సహాయక చర్యలు పటిష్టం గా ఉన్నాయని భక్తులు చెప్తున్నారు. అక్కడ చేపట్టిన పారిశుద్ధ్య నిర్వాహన కార్మికులు శుభ్రపరిచే తీరు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నాగా సాధువులు పవిత్ర నదులలో ఆచారబద్ధమైన స్నానంతో కుంభమేళా యొక్క వైభవం కనిపిస్తుంది. మహా కుంభ సమయంలో సంభవించే ఖగోళ అమరిక ప్రాముఖ్యత సంతరించుకుంది. 2025 మహా కుంభమేళా భారీగా హిందువులను ఐక్యం చేసిందని చెప్పవచ్చు.

⬅ Back to News