Chatbot Icon

55 వేల ఎకరాల భూమి స్వాధీనానికి. 3,500 కేసులు వేసిన తెలంగాణ వక్ఫ్ బోర్డు.

Published by Right Wing Network on Feb 24th, 2025

55 వేల ఎకరాల భూమి స్వాధీనానికి.   3,500 కేసులు వేసిన తెలంగాణ వక్ఫ్ బోర్డు.

తెలంగాణ వక్ఫ్ బోర్డు 55 వేల ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు వేలాదిగా కేసులు వేసింది.
గజాల భూమి నుంచి వందల వరకు రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆదినం లోకి తీసుకునేందుకు పనిచేస్తుంది. రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

వక్ఫ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా 77వేల ఎకరాలకు పైగా తన ఆధీనంలో ఉందని బోర్డు పేర్కొంది. అయితే 22 వేల ఎకరాలు లిటిగేషన్‌ లేకుండా ఉన్నట్లు బోర్డు చెప్తుంది.
ఉదాహరణకు చేవెళ్ల మండలం ఆలూర్‌ గ్రామంలో దాదాపు 1200 ఎకరాలు, మాదాపూర్‌ సమీపంలోని గుట్టల బేగంపేటలో 90 ఎకరాలు, మణికొండలో 108 ఎకరాలు, మల్కాజిగిరి మండలంలో 350 ఎకరాలు, రాజేంద్రనగర్‌లో 350 ఎకరాలు, మెదక్‌ మండలంలో లో 530 ఎకరాలు, మహేశ్వరం మండలంలో 560 ఎకరాలు లిటిగేషన్ లో ఉందని బోర్డు క్లెయిమ్ చేస్తోంది. 1,700 ఎకరాల అటవీ భూమి తమ బోర్డుది ఉందని అటవీ శాఖ నుండి లాక్కునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్తుంది . పహాడీషరీఫ్‌ సమీపంలోని 4 వేల ఎకరాల్లో దాదాపు 2 వేల ఎకరాల వక్ఫ్‌ భూమిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అప్పటి ఏపీ ప్రభుత్వం కేటాయించిందని, ప్రస్తుతం బోర్డు వద్ద 100 ఎకరాల లోపే మిగిలి ఉందని బోర్డు అధికారులు చెప్తున్నారు.

వక్ఫ్‌ భూములపై ​​వ్యాజ్యాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జరిగాయని బోర్డు సభ్యులు చెబుతున్నారు. ముందుగా రెవెన్యూ రికార్డుల్లో బోర్డు క్లెయిమ్ చేస్తున్న భూమిని రెవెన్యూ శాఖ మ్యుటేషన్ చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో భూములు తమ ఆధీనంలోకి రావడం లేదని, ప్రభుత్వం సర్వేలు చేసి వెరిఫికేషన్ తర్వాత కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంలో జాప్యం కారణాలుగా చెప్తుంది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన చాలా గెజిట్ నోటిఫికేషన్‌లు
1990 దశకం లో జారీ కాగ తరువాత గెజిట్ లు జారీ కాలేదని బోర్డు చెప్తుంది.

1961లోనే సర్వే చేసినట్లుగా పేర్కొంటున్నా సాంకేతిక కారణాల వల్ల గెజిట్ నోటిఫికేషన్‌లు ఆలస్యం అయ్యాయని, 2015 నుంచి వక్ఫ్‌బోర్డు తమ భూములను మ్యుటేషన్‌ చేయడంతోపాటు ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయడాన్ని నిలిపివేయాలని కలెక్టర్లకు లేఖలు రాస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

మల్కాజ్‌గిరిలో 350 ఎకరాలు మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని రాజేంద్రనగర్‌లో సమానమైన భూమి మీర్ మోమిన్ సాహబ్ కి పహాడీకి చెందినట్లు 60 సంవత్సరాల క్రితం క్లెయిమ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఆలూరు గ్రామంలో బోర్డు క్లెయిమ్ చేస్తున్న సుమారు 1200 ఎకరాల భూమికి నిజాం ముంతఖాబ్‌లు (మంజూరు సర్టిఫికెట్) ఉన్నట్లు వక్ఫ్ బోర్డు వాదిస్తుంది.

చట్ట ప్రకారం, ప్రభుత్వం సర్వే నివేదిక పంపిన ఆరు నెలల్లోపు కలెక్టర్లు రెవెన్యూ రికార్డులను సవరించాల్సి ఉంటుందని కానీ వక్ఫ్‌ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడం వల్ల జాప్యం జరుగుతున్నట్లు చెప్తున్నారు. అప్పటి ఏపీ ఉమ్మడి ప్రభుత్వం మణికొండలోని 1,950 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించిందని, అది పలు ఇన్‌ఫ్రా, బహుళజాతి కంపెనీలకు వేలం వేసిందని చెప్తున్నారు.

ఆరవై సంవత్సరాల క్రితమే వక్ఫ్‌ భూమిని గుర్తించారని వక్ఫ్‌ భూమిని సర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం 1961లో సర్వే కమిషనర్‌ను నియమించగా సర్వే వివరాలను ప్రభుత్వం పరిశీలించి ధ్రువీకరించింది. 1995లో కూడా సవరణ ప్రకారం 1995కి ముందు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులపై విచారణ అవసరం లేదని 2013లో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించామని బోర్జు చెప్తుంది.

కేంద్రం సవరణపై ఆందోళన

కొత్త వక్ఫ్ (సవరణ) బిల్లు 2024 పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందితే, వక్ఫ్ బోర్డు తన భూమిపై యాజమాన్యాన్ని కలెక్టర్లకు నిరూపించాల్సిన పరిస్థితి తలెత్తుతుందని బోర్జు ఆందోళన చెందుతుంది. మసీదు ,'అషుర్ఖానాలు కబ్రీస్థాన్ (ముస్లిం శ్మశానవాటిక)దర్గాలు వంటి ఆస్తులకు ఎలాంటి పత్రాలు లేవని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ బోర్డుకు ప్రతిపాదించిన సవరణపై వక్ఫ్ బోర్డు అధికారులు తమ ఆందోళనలు, వ్యక్తం చేస్తున్నారు.

⬅ Back to News